ఖర్గేపై ఆజాద్ కారాలు, మిరియాలు….

ఖర్గేపై ఆజాద్ కారాలు, మిరియాలు….

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తికి రాజ్యసభ సభ్యత్వాలే కారణమమని తెలిసింది. కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గేను రాజ్యసభకు పంపడం కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేకెత్తించింది. 9 సార్లు శాసనసభ్యుడిగా, ఒక సారిగి లోక్ సభ సభ్యుడుగా పని చేసిన ఆయన్ను మళ్లీ రాజ్యసభకు పంపిస్తారాని ఆజాద్ ఆసంతృప్తి వెళ్లగక్కినట్లు పార్టీ వర్గాల కథనం. ఖర్గేకు ప్రాధాన్యత ఇచ్చి తనను తాత్సారం చేస్తారనే ఆందోళనలో ఆజాద్ ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఫిబ్రవరితో ఆజాద్ పదవి కాలం ముగియనుంది. దరిమిలా రాజ్యసభలో విపక్ష నేత పదవిని ఖర్గేకు అప్పగిస్తారని అనుమానిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న ఆనందశర్మతో లేఖ రాయించడానికి కూడా అసలు కారణం ఇదే కావచ్చునని పలువురి అభిప్రాయం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos