ఈమె రూటే సెపరేటు…

  • In Film
  • February 13, 2019
  • 144 Views
ఈమె రూటే సెపరేటు…

సాధారణంగా సోషల్ మీడియాలో గ్లామర్ వరల్డ్ కు సంబంధించిన బ్యూటీలు అనగానే హాటుగా ఘాటుగా అంగాంగ ప్రదర్శనలు చేస్తూ మగాళ్ళ మతులు పోగొట్టే వారే ఉంటారు.  డీసెంట్.. డిగ్నిఫైడ్ గా ఉండే భామలు దాదాపు గా ఉండరు… వాళ్ళను వెతకాలంటే బూతద్దం కాకుండా భూతద్దం వాడాలి.  కానీ అలాంటివేవీ అవసరం లేకుండానే ఆ లోటు తీర్చేస్తోంది అర్చన జాయిస్. ఆమెవరు అని మీరు అడిగితే వెంటనే ‘KGF- చాప్టర్ 1’ సినిమాలో యాష్ చిన్నవాడిగా ఉన్నప్పుడు యాష్ కు అమ్మ పాత్ర పోషించిన నటి అని చెప్పాలి.   ఇంకా ఇంకా ఇంట్రో కావాలంటే.. భరతనాట్యం డాన్సర్.. అందులో ఎంఎ సర్టిఫికేట్ కూడా ఉంది.  కన్నడ రియాలిటీ డ్యాన్స్ షో ‘తకధిమి 3’ లో కూడా పాల్గొంటోంది.  ఇక మళ్ళీ సోషల్ మీడియా విషయానికి వస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ మొత్తం వెతికినా ఒక్క అసభ్యకరమైన ఫోటో కూడా కనిపించలేదు.  ఉంటే గింటే కష్టమైన యోగా పోజుల్లో తల కిందకు కాళ్ళు పైకి పెట్టడం.. బ్రూస్ లీ లాగా రెండు కాళ్ళను నేలమీద ఒక సరళరేఖ లాగా చాపి కూర్చోవడం ఇలాంటి భంగిమలున్నాయి. అవికూడా చక్కగా దుస్తులు వేసుకొని మాత్రమే.అయినా ఈ కాలంలో ఇంకా ఇలాంటి సత్తెకాలపు సత్తెమ్మలు ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. పోన్లెండి.. హాటు షోలు చేసి నిద్రలు చెడగొట్టే భామల మధ్యలో ఎడారిలో ఒయాసిస్సులా ఇలాంటి వారు ఉండడం కూడా అవసరమే. లేకపోతే ఇన్స్టాగ్రాము పేరు హాటుగ్రాము.. ఘాటుగ్రాము అని ఫిక్స్ అయిపోతారు జనాలు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos