దిశ చట్టంపై కేజ్రీవాల్ ప్రశంసలు..

దిశ చట్టంపై కేజ్రీవాల్ ప్రశంసలు..

మహిళలపై లైంగిక వేధింపులు,అత్యాచారాల నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన దిశ చట్టంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు జాతీయస్థాయి నేతలు,చిత్ర,క్రీడా రంగాల ప్రముఖులు సైతం దిశ చట్టంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సైతం దిశ చట్టంపై ప్రశంసలు కురిపించారు.ఈ మేరకు జగన్‌కు కేజ్రీవాల్ లేఖ రాశారు. ఏపీ ప్రబుత్వం తీసుకొచ్చినదిశచట్టంపై జగన్ ను కేజ్రీవాల్ అభినందించారు.ఇటువంటి చట్టాలతో బాధితులకు న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.దిశ చట్టం బిల్లు ప్రతిని తనకు పంపించాలని కోరారు. చట్టం ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తిపై 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసిసరైన ఆధారాలు ఉంటే… 21 రోజుల్లో శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై తీవ్ర నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుంది. సోషల్ మీడియా లేదా ఫోన్లలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos