ఆప్‌ మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జైల్లో వేయండి

ఆప్‌ మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జైల్లో వేయండి

న్యూ ఢిల్లీ: ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తుండడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో స్పందించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీకి నాదొక విజ్ఞప్తి. ఒక్కొక్కరిని ఎందుకు జైలుకు పంపిస్తున్నారు? ఇలా చేయడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయండి. ఏమేం కేసులు పెట్టాలని అనుకుం టున్నారో అన్ని కేసులు ఒకేసారి పెట్టేయండి. అలాగే ఇప్పుడు ఉన్న కేంద్ర ఏజెన్సీలన్నింటినీ పిలిచి విచారణ చేపట్టండి. ఆ తర్వాతే మేం మా పని చేసుకుంటాం. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇలాంటి విచారణలు కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం ఆప్ నేతలపై ఇలాంటి తప్పుడు కేసులే పెట్టారు. కానీ ఏమీ రాబట్ట లేకపోయా రు. ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పై కూడా తప్పుడు కేసులు పెట్టే కుట్ర జరుగుతోంది. ఢిల్లీలో విద్య, వైద్యం అత్యుత్తమంగా తీర్చిదిద్దామని వాటిని ఆపేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. విద్య విషయంలో మనీశ్ సిసోడియా అద్భుతంగా పని చేశారు. వైద్యం విషయంలో సత్యేంద్ర జైన్ ఉత్తమ ఫలితాలు రాబట్టరాని అందుకే వారిపై తప్పుడు కేసులు పెట్టైనా ఢిల్లీ అభివృద్ధిని ఆపాలని చూస్తోంద’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos