భాజపా గెలిస్తే… ఆ తప్పు రాహుల్‌దే

భాజపా గెలిస్తే… ఆ  తప్పు రాహుల్‌దే

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే అందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీయే బాధ్యులవుతారని ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉంటే తమ పార్టీ మొత్తం ఏడు స్థానాలను వదులుకునేదన్నారు. ‘కానీ ఢిల్లీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేద’న్నారు. పొత్తు కోసం గత మూడు నెలలగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. కాంగ్రెస్‌కు ఆ ఉద్దేశం లేద’న్నారు. ‘మోదీ, అమిత్ షా మళ్లీ అధికారంలోకి వస్తే అందుకు కేవలం రాహులే బాధ్యులవుతారని చెప్పేందుకు విచారిస్తున్నా. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గోవా, ఛండీగఢ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను ఆయన బలహీన పరుస్తున్నారు. ఇది మంచిది కాద’ని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బీజేపీని ఓడించగల సత్తా ఆమాద్మీ పార్టీకి ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రశ్నిస్తూ ఆమాద్మీ పార్టీ పుట్టింది. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడం కొంత ఇబ్బందే అయినా దేశ ప్రయోజనాల కోసం ఆ దిశగా ఆలోచించామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos