నేడే మంత్రివర్గ విస్తరణ..

నేడే మంత్రివర్గ విస్తరణ..

ఎట్టకేలకు తెరాస అధినేత కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ఆదివారం సాయంత్రం ముహూర్తం ఖరారు చేశారు.కొత్తగా ఆరు మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కేటీఆర్,హరీశ్రావులతో పాటు గంగుల కమాలకర్,పువ్వాడ అజయ్కుమార్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక మహిళల కోటాలో సబిత ఇంద్రారెడ్డి,సత్యవతి రాథోడ్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాజకీయ,ప్రాంతీయ,కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఈ ఆరుమందిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కేటీఆర్ కోసం హరీశ్రావును పక్కనపెడుతున్నారంటూ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలు,కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తుండడాన్ని గమనించిన కేసీఆర్ హరీశ్రావుకు మంత్రి పదవి ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ నుండి ఒకరిద్దరిని తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఎవరిని తప్పిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటే మాత్రం మంత్రివర్గం నుండి వారిని తప్పించకపోవచ్చు. అవసరాన్ని బట్టి మాత్రమే వారిని తప్పిస్తారని పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారు. ఆదివారం నాడు మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పిస్తే రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రి పదవులు దక్కే వారి సంఖ్య ఏడుకు చేరుకొంటుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుండి ఇద్దరిని తప్పిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. మంత్రి వర్గం నుండి తప్పిస్తారానే ప్రచారం సాగుతున్న వారిలో ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుండి సబితా ఇంద్రారెడ్డికి చోటు కల్పించే అవకాశం ఉంది.సుఖేందర్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించాలని బావించినప్పటికీ ఆయనను శాసనమండలి ఛైర్మెన్ గా అవకాశం కల్పించనున్నారు.కొంత కాలంగా ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుండి తప్పిస్తారనే ప్రచారం సాగింది.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ను తప్పిస్తే రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ లేకపోలేదు.బీజేపీ అదను కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాజకీయంగా నష్టం కలిగే నిర్ణయాలు కేసీఆర్ తీసుకొనే అవకాశాలు ఉండవని తెరాస నేతలు చెబుతున్న మాట..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos