కేసీఆర్‌కు తలనొప్పిగా మారిన వైఎస్ జగన్!

కేసీఆర్‌కు తలనొప్పిగా మారిన వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడును రాజకీయంగా శత్రువుగా భావిస్తూ ఐదేళ్లపాటు అవకాశం దొరికిన ప్రతీసారి చంద్రబాబును ఇరుకున పెడుతూ చంద్రబాబుతో పేచీ పెట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొద్ది రోజులుగా విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిపాలన మొదలుపెట్టాక జగన్‌ ప్రవేశపెడుతున్న పథకాలు,ప్రతిపక్షంపై జగన్‌ వ్యవహరిస్తున్న తీరు తెరాస అధినేత కేసీఆర్‌కు కొత్త చిక్కులు,ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.ఒక్క ఎంఐఎం మినహా అన్ని పార్టీల నేతలు ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలంటూ కేసీఆర్‌కు హితబోధనలు చేస్తున్నారు.ముఖ్యంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై శాసనసభ సాక్షిగా తమ వైఖరి ఏంటో వైఎస్‌ జగన్‌ స్పష్టం చేయడంతో ప్రతిపక్షం పట్ల జగన్‌ వ్యవహరిస్తున్న తీరును చూసి నేర్చుకోవాలంటూ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కొందరు ఎమ్మెల్యేలు రెడీగానే ఉన్నా – తాము వారిని ప్రోత్సహించ దలుచుకోలేదని..ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వస్తేనే  తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.ఒక పార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చలామణి కావడం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో ఉండదని – ఈ విషయంలో తమ శాసనసభ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తుందని జగన్ ప్రకటించారు.మరి ఇలా విలువలకు కట్టుబడి ఉంటామని జగన్ ప్రకటించడం మిగతా రాష్ట్రాలకు ఏమో కానీ తెలంగాణ శాసనసభకు మాత్రం ఇబ్బందికరంగా మారనుంది. అక్కడ అంతా ఫిరాయింపు రాజకీయమే నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని సీఎల్పీని విలీనం చేసుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ మాత్రం అలాంటివి ఉండవని – అలా చేస్తూ తనకూ చంద్రబాబుకు తేడా ఉండదని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించినవే అయినా అవి ఎంతో కొంత చంద్రశేఖరరావును కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నాయి!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos