కూలిన కేసీఆర్ ఆశలసౌధం..

ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌,ఒడిశా,సిక్కమ్‌ రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి.ఎగ్జిట్‌పోల్స్‌లో కేంద్రంలో ఎన్డీయే మరోసారి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రానుందంటూ వెల్లడికాగా ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ,శాసనసభ ఎన్నికల్లో వైసీపీ,తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించనున్నాయంటూ ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. ఎగ్జిట్‌పోల్స్‌పై ఎలా స్పందించాలో తెలియని సందిగ్ధత పరిస్థితి కేసీఆర్‌కు ఎదురైంది.తెలంగాణలో 14కు తగ్గకుండా లోక్‌సభ స్థానాలు తెరాస వశమవుతాయనే ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించడంపై ఆనందంగానే ఉన్నా కేంద్రంలో తన అంచనాలు తప్పడంపై కేసీఆర్‌లో నిరాశ నెలకొంది. ఎన్నికల ముందస్తు సర్వేలు,ఓటింగ్‌ సరళి ప్రకారం ఈసారి ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని భావించిన కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి దేశం మొత్తం కాళ్లకు బలపాలు కట్టుకొని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు.ఆదివారం విడులైన అన్ని ఎగ్టిట్‌ పోల్స్‌లోనూ కేంద్రంలో ఎన్డీఏ మరోసారి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి.ఏవో ఒకటీఅరా సర్వేలు మినహా అన్ని ప్రధాన సర్వేల్లోనూ ఎన్టీఏ 300కు పైగా సీట్లు సాధించడం తథ్యమంటూ తేల్చేశాయి.దీంతో ఫెడరల్‌ ఫ్రంట్‌తో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానంటూ కేసీఆర్‌ పెట్టుకున్న ఆశలసౌధాలు కుప్పకూలాయి.తాను అనుకున్న దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఉండటం ఇప్పుడు కేసీఆర్ కు మింగుడు పడటం కష్టమని చెప్పక తప్పదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమై.. వారి అంచనాలు కరెక్ట్ అయిన పక్షంలో.. మరో ఐదేళ్ల పాటు ఫెడరల్ ఫ్రంట్ ను కోల్ట్ స్టోరేజీలో పెట్టేయాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంటుందని చెప్పక తప్పదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos