కెసిఆర్‌ను అడ్డుకున్న నిరుద్యోగి

కెసిఆర్‌ను అడ్డుకున్న నిరుద్యోగి

హైదరాబాదు: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను ఒక నిరుద్యోగి ఇక్కడి గన్ పార్కు వద్ద అడ్డుకున్నారు. కారు దగ్గరకు వెళ్లిన ఆ వ్యక్తి తనకు ఉద్యోగం ఇవ్వాలని కెసీఆర్ను డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిరుద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, నిమిషాలపాటు మౌనం పాటించాక ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి కెసిఆర్ సిద్ధమవుతున్న ఈ సంఘటన జరిగింది. తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు కొన్ని చోట్ల నిరసనలకు దారి తీసాయి. జయశంకర్ జిల్లా కలెక్టరేట్ వద్ద మహదేవ్పూర్కు చెందిన యువకుడు మధు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగాడు. భూ దాఖలాల్లో తన పేరు నమోదు చేయలేదని ఆందోళనకు దిగాడు. పోలీసులు మధును బంధించి ఠాణాకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos