కౌశల్‌పై తిరగబడ్డ కౌశల్‌ ఆర్మీ…

  • In Film
  • February 27, 2019
  • 143 Views

తెలుగు బిగ్‌బాస్‌ 2 సీజన్‌ విజేత కౌశల్‌ మందాపై కౌశల్‌ ఆర్మీ సభ్యులు చాలా మంది కౌశల్‌కు వ్యతిరేకులుగా మారిపోయారు.కౌశల్‌ అసలు స్వరూపం తమకు ఇన్నాళ్లకు తెలిసిందని కౌశల్‌ తాము అనుకున్నంత మంచివాడు కాదంటూ కౌశల్‌ ఆర్మీ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.బిగ్ బాస్ 2 సీజన్ విజేతగా నిలిచిన కౌశల్ మందాకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.  బిగ్ బాస్ సీజన్ 2 ప్రసారం అవుతున్న సమయంలో కౌశల్ ఆర్మీ పేరుతో ఫ్యాన్స్ మామూలుగా హడావుడి చేయలేదు.  ఇతర బిగ్ బాస్ పోటీదారులపై ట్రోలింగ్ కు కూడా పాల్పడ్డారు.  కౌశల్ వ్యతిరేకులు మాత్రం అసలు కౌశల్ ఆర్మీ అంతా ఫేక్ అని కౌశల్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని కూడా విమర్శించారు. ఇదిలా  బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ కు లభించిన యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఖర్చుపెడతానని కౌశల్ అప్పట్లో ప్రకటించాడు. అయితే ప్రైజ్‌ మనీని ఫైనల్‌లో ప్రకటించిన విధంగా కేన్సర్‌ రోగులకు ఖర్చు చేయకపోవడంతో కౌశల్‌ ఆర్మీ సభ్యులు ప్రశ్నించగా అందుకు “నా డబ్బు నేను ఎలాగైనా ఖర్చు పెడతాను” అని సమాధానమిచ్చాడంటూ ఆరోపిస్తున్నారు. అంతే కాదు తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ట్రోల్ చేయమని ఫ్యాన్స్ ను ప్రోత్సహిస్తున్నాడని కూడా ఆరోపిస్తున్నారు. ఎక్కడికి వచ్చినా అభిమానుల చేత డబ్బు ఖర్చుపెట్టిస్తున్నాడని.. ఏ చిన్న ఈవెంట్ లో పాల్గొనాలన్నా డబ్బు ఆశిస్తున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. బిగ్ బాస్ లో ఉన్న కౌశల్ వేరు.. ఇప్పుడు మేము చూస్తున్న కౌశల్ వేరని అభిమానులు మండిపడుతున్నారు.ఇక కౌశల్‌ ఆర్మీ అంటూ ఒకటి తయారవడానికి ఆద్యుడైన ఇమ్మాన్‌ కౌశల్‌పై ఒక రేంజులో ఫైరవుతున్నారు.బెంగళూరుకు చెందిన అనామిక ఒక మహిళ ఫ్యాన్‌ మాట్లాడుతూ..కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ కోసం తాను కూడా విరాళమిచ్చానన్నారు.అయితే డబ్బులు ఎలా వాడుతున్నారో ప్రశ్నించింనందుకు తనపై దూషణలకు పాల్పడ్డారని గ్రూపు నుంచి తీసేసారని ఆరోపించారు. “కౌశల్ ఆర్మీ గ్రూపులో మనం ఏదైనా విషయంపై ప్రశ్నిస్తే మనల్ని టార్గెట్ చేసేలా చేస్తారు. మనపై అందరూ దాడి చేస్తారు. మనల్ని గ్రూపు నుంచి తీసేస్తారు. మనం డబ్బు ఇవ్వాలి… కానీ మనకు ఆ డబ్బు ఎలా వాడుతున్నారు? అని అడిగే హక్కు ఉండదు” అని తెలిపారు.రాయలసీమ కౌశల్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరికుమార్‌ కూడా కౌశల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అప్పట్లో విశాఖపట్టణంలో జరిగిన సక్సెట్‌మీట్‌ కోసం,అనంతపురంలో జరిగిన సక్సెస్‌ మీట్‌ కోసం వేలాది రూపాయలు విరాళంగా ఇచ్చామన్నారు.ఇక కర్నూలులో జరిగిన మీట్‌ కోసం చాలా శాతం ఖర్చులు తానే భరించానని పైగా వాటర్‌ ప్యూరిఫైయర్లు,500 మందికి అన్నదానం ఇలా ఎన్నో చేసామన్నారు. అటువంటిది కౌశల్‌ను చిన్న ప్రశ్న అడిగినందుకు తనపై తిరగబడ్డారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న వార్త ఛానల్‌ యజమాన్యానికి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేయించానని వెంటనే కార్యక్రమాన్ని నిలిపివేసారంటూ ఒక ఫ్యాన్‌తో కౌశల్‌ మాట్లాడిన ఫోన్‌ సంభాషణను సంపాదించిన ఒక ఛానల్‌వాళ్లు ఇలాంటి వ్యక్తిని ఎలా నమ్మారంటూ కౌశల్‌ ఫ్యాన్స్‌తో పెద్ద చర్చా కార్యక్రమం నిర్వహించారు.కౌశల్‌ ఆర్మీ సభ్యులే కౌశల్‌పై ఆరోపణలు చేస్తుండడంతో ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న బాబు గోగినేని మరోసారి బయటకు వచ్చి హంగామా షురూ చేసారు. తాజా వ్యవహారంపై బాబు గోగినేని స్పందిస్తూ… కౌశల్ ఆర్మీ గుట్టు రట్టయిందని, దొంగలు పట్టుడ్డారు అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పెయిడ్ ఆర్మీ గురించి మాట్లాడుకున్నాం. అది పేయింగ్ ఆర్మీ అని కూడా తేలింది. వీరి పక్కన పెయిడ్ మీడియా ఉన్న సంగతి ఎవరూ మాట్లాడటం లేదని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ఈ రోజు కౌశల్ ఆర్మీ వారిలో వారే కొట్లాడుకుని ఆయన్ను ఇప్పుడు తిట్టేసి… వీరేదో పవిత్ర గంగాజలంలో మునిగినట్లు ప్రవర్తిస్తున్నారు. గతంలో వీరు కూడా కౌశల్ ఆర్మీ పేరుతో ఎంతో మందిని దూషించిన వ్యక్తులే అని బాబు గోగినేని చెప్పుకొచ్చారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos