కథువా దోషులు ఆరుగురు

కథువా దోషులు ఆరుగురు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచార కేసు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా పంజాబ్ పఠాన్‌కోట్ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. ప్రధాన నిందితుడు సాంజీ రామ్‌, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్‌ ఖజూరియా, సురేందర్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌ల, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నేరగాళ్లుగా తేల్చింది. సాంజీ రామ్‌ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దోషులకు మధ్యాహ్నం శిక్ష ఖరారు కానుంది. జమ్ము-కశ్మీర్ కథువా జిల్లాలో నిరుడు జనవరిలో ఎనిమిదేళ్ల బాలిక అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారానికి గురయ్యింది. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి గ్రామంలోని దేవాలయంలో బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయట పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos