కార్తికి చేదు అనుభవం

కార్తికి చేదు అనుభవం

న్యూ ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు కార్తీ చిదంబరంకు బుధవారం అత్యున్నత న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం కోర్టు రిజిస్టార్ వద్ద కార్తీ ఇంతకు ముందు రూ.10 కోట్లు ధరావత్తు చేసారు. విదేశాల నుంచి తాను తిరిగి వచ్చినందున ఆ సొమ్ము తిరిగి ఇప్పించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ‘అది వడ్డీకి తీసుకొచ్చిన డబ్బు . ప్రతినెలా వడ్డీ కట్టాల్సి వస్తోందని’ నివేదించారు. ఆయన వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ‘మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి.’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన వేసవి కాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్రమ లావాదేవీల ఆరోపణలపై కార్తీ చిదంబరం సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఎదుర్కొంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos