సింహం వెంటాడితే ఎట్టా ఉంటాదో తెలుసా..

సింహం వెంటాడితే ఎట్టా ఉంటాదో తెలుసా..

కారులో వెళుతున్నపుడు సింహం కనిపిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.అటువంటిది మృత్యువులా తరుముతుంటే భయం ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా మాటలు చాలవు.ఇటువంటి ఘటనే కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని అటల్ బిహారీ వాజ్‌పెయి జూలాజికల్ పార్కులో సఫారీకి వెళ్లిన నలుగురు పర్యాటకులకు ఎదురైంది.పార్కులో వాహనంలో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా ఓ సింహం పర్యాటకుల వాహనాన్ని వెంబడించింది.మొదట సరదాగానే తీసుకున్నా సింహం వాయువేగంతో దూసుకొస్తుండడంతో వాహనం వేగాన్ని పెంచి కొంత దూరం వెళ్లి నిలిపారు.అయినప్పటికీ వదలని సింహం మృత్యుదేవతాల తరుముతుంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాహనంతో పలాయనం చిత్తగించారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos