కపిల్ మిశ్రా మద్దతుదారుల వందతులే అల్లరకు ఆజ్యం

కపిల్ మిశ్రా మద్దతుదారుల వందతులే అల్లరకు ఆజ్యం

న్యూ ఢిల్లీ : భాజపా నాయకుడు కపిల్ మిశ్రా మద్దతుదారులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతే రాజధానిలో పెద్ద ఎత్తున హింసా కాండకు దారి తీసిందని పోలీసులు న్యాయస్థానానికి దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నారు. కపిల్ మిశ్రా, ఆయన మద్దతు దారులు మౌజ్పూర్లో ఫిబ్రవరి 23న సీఏఏ కు మద్దతుగా ప్రదర్శన చేసారు. వారు జఫరాబాద్లో సీఏఏ వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. డయల్పూర్లో ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్పై దుండగులు మూక దాడి చేసారు. స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ పేరును అభియోగ పత్రంలో ప్రస్తావించినా నిందితుడిగా పేర్కొనలేదు. అతను ఛాంద్ బాగ్లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై భాజపా నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే ఢిల్లీలో అల్లర్లకు నాంది అయిందని అంతర్జాతీయ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల పాటు సాగిన ఢిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది మరణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos