కెనడా పార్లమెంటులో కన్నడ కస్తూరి

కెనడా పార్లమెంటులో కన్నడ కస్తూరి

టోరెంటో: కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య సభలో కన్నడంలో ప్రసంగించి మాతృ భాష పట్ల మమకారం చాటుకున్నారు. ఆయన చేసిన ప్రసంగం ఎంతో మంది హృ ద యాలను గెలుచుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది. ‘‘కెనడియన్ పార్లమెంటులో నేను నా మాతృభాష (మొదటి లాంగ్వేజ్)లో మాట్లాడాను. ఈ అందమైన భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడతారు. భారత్ కు బయట ప్రపంచవ్యాప్తంగా ఒక పార్లమెంటులో కన్నడలో మాట్లాడడం ఇదే మొదటిసారి’’ అని చం ద్ర ఆర్య ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. పార్లమెంటులో ప్రసంగించే అవకాశం లభించినప్పుడు ఆయన కన్నడలో మాట్లాడాలని ఉందని సభా అనుమతి తీసుకుని ప్రసంగించారు. రచయి త కువెంపు రాసిన, డాక్టర్ రాజ్ కుమార్ ఆలపించిన.. ‘‘నీవు ఎక్కడ ఉన్నా..ఎలా ఉన్నా.. ఎప్పుడూ కన్నడిగానే ఉండాలి’’ అన్న పాటతో ప్రసంగాన్ని ముగిం చా రు. తోటి సభ్యులు చప్పట్లతో ఆయన్ను అభినందించడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos