నోరు జారిన కంగనకు నోటీసులు

నోరు జారిన కంగనకు నోటీసులు

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. టైమ్ పత్రిక గుర్తింపు పొందిన దాదీ బిల్కిస్ బానును ఉద్దేశించి చేసిన అభ్యం తరకర ట్వీట్ ఇందుకు కారణం. గతంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా గళమెత్తిన దాదీ నూతన వ్యవసాయ చట్టాలను నిరసించి రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. దీంతో ‘సేమ్ దాదీ’అని ట్విటర్లో వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ఇంకా రూ. 100కే ఇలాంటి వారు లభిస్తారంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ ఫొటోలో ఉన్నది బిల్కిస్ దాదీ కాదు. దీంతో నెటిజన్లు స్పందిస్తూ రైతుల ఆందోళన పట్ల కంగన బాధ్యతరాహిత్య వైఖరి, దాదీని అపహాస్యం చేసిన తీరుపై మండిపడ్డారు. దీంతో కంగనా ఆ ట్వీట్ను డిలీట్ చేసింది. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా పరగణించిన ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ(డీఎస్జీఎమ్సీ) కంగనాకు లీగల్ నోటీసులు ఇచ్చింది. దేశంలోని రైతులు చేస్తున్న ఆందోళన పట్ల ఇంత బాధ్యతా రహి త్యంగా వ్యవహరించకూడదని, ఇందుకు ఆమె క్షమాపణ చెప్పాలని డీఎస్జీఎమ్సీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. న్యాయవాది హర్కమ్ సింగ్ కూ డా స్పందించారు. ‘ఆమె అకౌంట్ ను తొలగించేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో ఇలాంటివి తగవు. ఏడు రోజు ల్లో సమాధానం రాకపోతే పరువు నష్టం దావా వేస్తామ’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos