మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోరులో మ‌ధ్య‌లోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ

మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోరులో మ‌ధ్య‌లోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కమలనాధులు ఆశలు వదులుకున్నారని రాష్ట్ర మాజీ సీఎం, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాధ్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసిన అనంతరం కమల్ నాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపుపై ఆశలు వదులుకున్న బీజేపీ దింపుడు కళ్లెం ఆశతో ప్రయత్నాలు సాగిస్తోందని అన్నారు. మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్ధానాలకు గాను బీజేపీ ఇప్పటివరకూ 78 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో అభివృద్ధి జరిగిందని ఘనంగా చెప్పుకుంటున్న బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని అభ్యర్ధుల జాబితానే వెల్లడిస్తోందని కమల్ నాధ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో అభివృద్ధిపై కాషాయ పార్టీ సాగిస్తోన్న ప్రచారం అభూత కల్పనేనని రుజువైందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడంతో ఆ పార్టీ దయనీయ స్ధితి వెల్లడైందని అన్నారు. , 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు, బీజేపీ 109 సీట్లను గెలుచుకున్నాయి. కమల్ నాధ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో చౌహాన్ ప్రభుత్వం 2020 మార్చిలో కుప్పకూలడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos