ఆమె నల్లజాతి మహిళ

ఆమె  నల్లజాతి మహిళ

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ నల్ల జాతి మగువైనందున ఆ పదవికి పనికిరారని అధ్యక్షుడు ట్రంఫ్ నోరు పారేసుకున్నారు. వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. ‘ఆమె ఒక నల్లజాతి మహిళ. తల్లిదండ్రలు ఇక్కడకు వలస వచ్చారు. నేను విన్నది ఏంటంటే ఆమె ఇక్కడ జన్మించలేదు. అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికిరాదు. వైట్హౌస్ అవసరాలను తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి కమలా హ్యారిస్కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు నెటిజనులు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించిన ఆమెకు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని వివ రించారు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి కూడా ట్రంప్ ఇలానే ప్రచారం చేశారు. ఆయన కెన్యాలో జన్మించారని.. అధ్యక్షుడిగా ఎన్నిక వ్వ డానికి అర్హత లేదని ట్రంప్ ఆరోపించారు. దాంతో ఒబామా తాను హవాయిలో జన్మించినట్లు చూపిస్తూ తన జనన ధృవీకరణ పత్రాన్ని విడుదల చేశారు. అయినా కూడా ట్రంప్ అది ఫేక్ సర్టిఫికెట్ అంటూ రాద్దాంతం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos