మావోయిస్టు కళావతి అరెస్టు

మావోయిస్టు కళావతి అరెస్టు

అమరావతి: విశాఖ మన్యం బురదకోట గ్రామంలో మావోయిస్టు పార్టీ ప్రాంతీయ సమితి సభ్యురాలు సాకె కళావతి అలియాస్ భవానిని బంధించినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ శనివారం ఇక్కడ తెలిపారు.‘ గత 20 ఏళ్లుగా ఉద్యమంలో వివిధ విభాగాల్లో కళావతి పని చేసింది. ఆమె మావో యిస్టు స్టేట్ జోన్ కమిటీ సభ్యుడు పెద్దన్న అలియాస్ జగన్ భార్య. రెండు తూటా గాయాలతో ఆమెను పోలీసులు బంధించారు. రంపచోడవరం న్యాయ స్థానంలో హాజరు పరచిన తర్వాత చికిత్స కోసం రాజ మహేంద్ర వరం ఆస్పత్రికి తరలించామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos