హాలీవుడ్‌ చిత్రంలో చందమామ..

  • In Film
  • July 1, 2019
  • 139 Views
హాలీవుడ్‌ చిత్రంలో చందమామ..

తెలుగు,తమిళంతో పాటు అప్పుడప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా మెరుస్తున్న కాజల్‌ అగర్వాల్‌ త్వరలో హాలీవుడ్‌ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.వరుస ఫ్లాపులతో పూర్తిగా వెనుకబడ్డ హీరో మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న ఆంగ్ల చిత్రంలో కాజల్‌ కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం.కొద్ది రోజుల క్రితం హాలీవుడ్‌ దర్శకుడితో కథ గురించి చర్చించిన మంచు విష్ణు చిత్రాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్నారని హాలీవుడ్‌ చిత్రాన్ని నిర్మించడం కోసమే వీఎమ్‌ఆర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి సినిమాను తెరకెక్కించనున్నారు. కాన్సెప్ట్ ను ఇటీవల విన్న కాజల్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే మంచు విష్ణు కూడా దీనిపై అధికారికంగా ప్రకటన వెల్లడించనున్నట్లు తెలుస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos