మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు

మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు

జనగామ : ‘నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశపడ్డాం. దానికి భిన్నం తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్ ను అవమాన పరిచేలా.. మాట్లాడడం జుగుప్సకరమ’ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. సీఎంలు, ప్రధానితో ఎన్నో విషయాలు చర్చిస్తారు. వాటిని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రజాస్వామ్యవాదయకు తీవ్రంగా ఖండించాలి.కేటీఆర్ సీఎం కావడానికి మోదీ ఆశీర్వాదం అవసరంలేదు. నిన్ను అడిగేవాడు ఎవరు లేరన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలంటే ప్రజలు అనుకుంటే అడ్డుకోవడం నీ అయ్య నుంచి కూడా కాదని ఘాటుగా విమర్శించారు. దీన్ని బట్టే ఆయన జ్ఞానం ఏందో తెలుస్తున్నదని ఎద్దేవా చేశారు. మోదీ తెలంగాణ రాష్ట ఏర్పాటుపై కూడా మొదటి నుంచి పరిచేలా మాట్లాడుతున్నారు.  మోదీకి సిగ్గుంటే.. మనిషి వైతే విభజన హామీలను తొక్కి పట్టి వాటిని తొమ్మిదేళ్లుగా ఎందుకు నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి లో నీ భాగస్వామ్యం ఏది? కాజీపేట కోచర్ ఫ్యాక్టరీ సర్వే కనీసం చేయించావా..అని నిలదీశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. బీజేపీ వాళ్లకు ఓట్లు అడిగే నైతికత లేదన్నారు. అడుగడుగునా తెలంగాణను అవమనిస్తున్నారు. ఇలాంటి పార్టీ తెలంగాణకు అవసరమా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. దళిత, మైనారిటీ వ్యతిరేక, తెలంగాణ, రైతాంగ వ్యతిరేక బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos