అనుమతిస్తే ట్రంప్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తా…

అనుమతిస్తే ట్రంప్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తా…

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ వ్యవహార శైలి చూస్తుంటే పాల్‌కు నిజంగానే మతిస్థిమితం తప్పిందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా తనను తాను ప్రమోట్‌ చేసుకోవడానికి పాల్‌ పడుతున్నట్లు అగచాట్లు ప్రజలకు విపరీతమైన నవ్వు తెప్పిస్తున్నాయి.తాజాగా అటువంటి మరొక కామెడీ స్కిట్‌ చేసి పాల్‌ మరోసారి ప్రజలను నవ్వుకునేలా చేసారు.ప్రసంగాన్ని మొదట జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో మొదలుపెట్టి తరువాత నాదెండ్ల భాస్కర్‌రావు,సీఎం చంద్రబాబునాయుడు,ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వరకు తీసుకెళ్లాడు.త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి 35శాతం ఓట్లు పడనున్నాయని జనసేనకు కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే పడనున్నాయని తెలిపాడు.అందుకు జనసేన తన పార్టీతో కలసి రావాలని జనసేన-ప్రజాశాంతి కలసి పోటీ చేస్తే విజయం తమ కూటమిదేనని ఎన్నికల్లో గెలిచాకా సీఎం కుర్చీ పవన్‌కళ్యాణ్‌కే వదిలేస్తానని ప్రకటించాడు. అదేమంటే ఈసారి కాపుల కులానికి చెందిన నేతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని తాను నమ్ముతున్నామన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటూ నాదెండ్ల భాస్కర్‌రావు సూచించారని అందుకే జనసేనను తనతోకలసి నడవాలంటూ కోరుతున్నామన్నారు.ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటివరకు భారతదేశం పర్యటనకు రాకపోవడానికి తానే కారణమన్నారు.ఇప్పుడప్పుడే భారత్‌కు రావద్దని తాను సూచించడంతోనే ట్రంప్‌ రాలేదని ప్రధాని నరేంద్రమోదీ,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతిస్తే ట్రంప్‌ను నేరుగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకే తీసుకువస్తానన్నారు. కేవలం మోదీ చంద్రబాబు అనుమతి పత్రాలు ఇస్తే… సింగిల్ పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా ట్రంప్ పర్యటన మొత్తం వ్యయాన్ని తానే భరిస్తానని కూడా పాల్ తనదైన శైలిలో చెప్పుకుపోయారు. మొత్తంగా పవన్ దగ్గర నుంచి ఏకంగా ట్రంప్ దాకా పలు అంశాలను మాట్లాడేసిన పాల్… మరోమారు కామెడీని పంచారని చెప్పాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos