దిశను సజీవ దహనం చేశారు..

దిశను సజీవ దహనం చేశారు..

ప్రస్తుతం పటిష్ట పహార మధ్య చర్లపల్లి జైల్లో ఉన్న దిశ హత్యాచార నిందితుల్లో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ ఆరీఫ్‌ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జైల్లో కాపలాగా ఉన్న జవాను వద్ద వాస్తవాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు జవాన్లు వారితో మాట కలపగా, ప్రధాన నిందితుడు ఆరిఫ్, మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గపు నిర్వాకాన్ని పూస గుచ్చినట్టు చెప్పాడట.దిశను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని లాక్కెళ్లామని ఆ సమయంలో కాపాడాలంటూ పెద్దగా కేకలు వేస్తుంటే ఎవరైనా వింటారన్న భయంతో తమ వద్ద ఉన్న మద్యాన్ని బలవంతంగా నోట్లో పోశామని అప్పటికే తీవ్ర భయంతో ఉన్న దిశ స్పృహ తప్పగా అత్యాచారం చేశామని ఆరిఫ్ చెప్పినట్టు జైలు సిబ్బందిలో ఒకరు వెల్లడించారు.అనంతరం లారీలో ఎక్కించి పలుమార్లు అత్యాచారం చేశామని ప్రతిఘటించిన ప్రతిసారి మద్యం తాగించడంతో పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడించాడట.దీంతో చనిపోయిందని భావించి పెట్రోల్‌ పోసి నిప్పంటించామని వెల్లడించాడట.ఇదిలా ఉండగా జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని దిశ కేసులో నిందితులు అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మంగళవారం చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ నిందితులోత మాట్లాడారు. ఆ సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని వారు ఫిర్యాదు చేశారు. కాగా.. తనకు జ్వరంగా ఉందని ప్రధాన నిందితుడు ఆరిఫ్ చెప్పగా… అతనికి వైద్యం అందించారు.మరో నిందితుడు కిడ్నీ సమస్యతో మాధపడుతుండటంతో అతనికి కూడా వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. దిశ కేసులో నలుగురు నిందితులను తమ గదులు దాటి బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. గదిలోపలే బాత్రూం కూడా ఉంది. టిఫిన్,భోజనం కూడా తలుపు కింద నుంచే అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos