ఢిల్లీ హింస పై వ్యాఖ్యానించిన న్యాయమూర్తి బదిలీ

ఢిల్లీ హింస పై వ్యాఖ్యానించిన న్యాయమూర్తి బదిలీ

న్యూ ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్పై బదిలీ వేటు పడింది. ఆయన్ను రాష్ట్ర పతి కోవింద్ బుధవారం రాత్రి పంజాబ్-హరియాణా ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేసారు. మురళీధర్ బదిలీని అత్యున్నత న్యాయ స్థానం కొలీజియం రెండు వారాల క్రితమే సిఫార్సు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కొంత సేపటికే బదిలీ వేటు పడటం పలు అనుమానాలకు దారి తీసింది. జస్టిస్ మురళీధర్ను కేంద్రం కావాలనే బదిలీ చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దుయ్య బట్టింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రికి రాత్రే జస్టిస్ మురళీధర్ను బదిలీ చేయడం షాకింగ్ విషయం కానప్పటికీ న్యాయవ్యవస్థకు సిగ్గుచేటు. న్యాయ వ్యవస్థపై కోట్లాది మంది భారతీయులకు అపారమైన విశ్వాసం ఉంది. వాస్తవాల్నికప్పిపుచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయ’ ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విటర్ లో మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos