శివసేన, భాజపా మధ్య పొత్తు

శివసేన, భాజపా మధ్య పొత్తు

ముంబై: సమీప భవిష్యత్తులో శివసేన, భాజపా కలిసే అవకాశం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నేత మనో హర్ జోషి బుధ వారం ఇక్కడ వ్యాఖ్యానించారు. దీని గురించి తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ‘చిన్న చిన్న విషయాలపై విభేదించుకోవడం కంటే సర్దుకుపోవడమే మంచిది. కీలకమనుకునే విష యాల్లో మన అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తీకరించటంలో తప్పు లేదు. రెండు పార్టీలు కలిసి పనిచేస్తే రెండు వర్గాలకూ లబ్ధి చేకూరుతుంది. భాజపాతో శివసేన ఎప్పటికీ కలవదని కాదు. ఉద్ధవ్ ఠాక్రే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటార’ ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos