ఆర్థిక వివాదాలతోనే ఝాన్సీతో బ్రేకప్‌..

  • In Film
  • July 1, 2019
  • 819 Views
ఆర్థిక వివాదాలతోనే ఝాన్సీతో బ్రేకప్‌..

జోగి బ్రదర్స్‌ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండంటే అతిశయోక్తి కాదేమో అనేంతగా జోగి నాయుడు,కృష్ణంరాజులు వెండితెరపై,బుల్లితెరపై ఖ్యాతి గడించారు.శ్రీకాకుళం యాసలో పంచ్‌లు,డైలాగులు,కామెడీ టైమింగ్‌తో,హావభావాలతో జోగి బ్రదర్స్‌ చేసే నటనకు ప్రతీ ఒక్కరు ఫిదా అవాల్సిందే. అంతలా ప్రేక్షకులను మెప్పించిన జోగీబద్రర్స్‌లో ఒకరైన జోగి నాయుడు వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో అటుపోట్లకు గురైంది.యాంకర్‌ ఝాన్సీతో ప్రేమ,పెళ్లి,విడాకులు జోగినాయుడు జీవితాన్ని కుదుపులకు గురి చేసింది.బుల్లితెరపై ప్రవేశం నుంచి రెండవ వివాహం వరకు జోగినాయుడు ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో వెల్లడించారు.సహచరుడు కృష్ణంరాజుతో కలసి జీకే మోహన్‌ రూపొందించిన జోగిబ్రదర్స్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కడంతో కార్యక్రమంతో పాటు జోగిబ్రదర్స్‌ పేరుతో మేము కూడా గుర్తింపు తెచ్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. జోగి బ్రదర్స్ ప్రొగ్రాం చూసి దర్శకుడు కృష్ణవంశీ గారు ఫోన్ చేసి స్వయంగా కలిశారు. మా కార్యక్రమం గురించి అడిగి తెలుసుకొన్నారన్నారు. స్క్రిప్టు ఎలా రాస్తారు? ఎంత రాస్తారు లాంటి విషయాలు అడిగి తెలుసుకొన్నాడని తెలిపారు. స్క్రిప్టు లేకుండా సహజంగా మాకు ఏది తోచితే అది మాట్లాడుకుంటూ వెళ్తామని మేము చెప్పడం షాక్ తిన్నాడని గుర్తు చేసుకున్నారు.జోగి బ్రదర్స్ ప్రారంభం కావడానికి కంటే ముందే యాంకర్‌ ఝాన్సీతో వివాహం జరిగిందని ఝాన్సీతో నా వైవాహిక జీవితం దాదాపు ఏడు, ఎనిమిది సంవత్సరాలు అద్భుతంగా సాగిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ల జీవితంలో పోలీకలు మొదలవుతాయి జీవితం సంక నాకి పోతుంది. డబ్బు, విలాసాలు, దర్పం గురించి ఆలోచించి.. ఎదుటి వాళ్లతో పోల్చి చూసుకోవడం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి అంశాలు మా జీవితంలోకి ప్రవేశించిన ఏడాదిలోనే జీవితం దుర్బరమైంది. ఝాన్సీతో బ్రేకప్ కావడమే నా జీవితంలో అతి పెద్ద కుదుపని జోగి నాయుడు అన్నారు.ఝాన్సీ వేధింపులకు గురిచేశానని చెప్పడం. ఇంకా ఆ క్రమంలో వచ్చిన ఎన్నో రూమర్లలో వాస్తవం లేదు. ఆర్థిక పరమైన అంశాలే మా బ్రేకప్ కారణాలు. ఝాన్సీతో ఉన్నప్పుడు స్టూడియో బాగా నడిచేది. చాలా బిజీగా ఉండే వాళ్లం. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే విషయాల్లో వాస్తవం లేదు. అసలు ఏం జరిగిందో మాకు మా సన్నిహితులకు మాత్రమే తెలుసు అని జోగి నాయుడు పేర్కొన్నారు.ఝాన్సీతో బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకోవద్దని అనుకొన్నాను. దాదాపు 8 సంవత్సరాలు వేచి చూశాను. ఆమె తిరిగి వస్తారని ఆశించాను. ఆ క్రమంలో ఒంటరిగా ఉండటం వల్ల రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రెండో పెళ్లికి ముందు ఆమెతో చాలా సంప్రదింపులు జరిపాను. కానీ ఝాన్సీ ఒప్పుకోలేదు. ఆమెది ఒకటే మాట.. ఒకటే బాట. తనకు ఇష్టం లేదు కాబట్టి వదిలేశాను అని అన్నారు. ప్రస్తుతం సౌజన్య అనే అమ్మాయిని నా తల్లిదండ్రులు చూసి పెళ్లి చేశారు. ప్రస్తుతం వైవాహిక జీవితం సవ్యంగా సాగుతున్నది.సౌజన్య లాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టం. నా తల్లిదండ్రులు బాగా ఇష్టపడుతారు. బ్రేకప్ తర్వాత లవ్ మ్యారేజ్ అంటే అభిప్రాయం మారలేదు. నాకు ఏదో జరిగిందని తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకోను అని జోగిని నాయుడు వెల్లడించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos