కొబ్బరి బొండాలు కొట్టడానికి వ్యక్తి కావలెను..జీతం రూ.32వేలు..

కొబ్బరి బొండాలు కొట్టడానికి వ్యక్తి కావలెను..జీతం రూ.32వేలు..

వేలు,లక్షలు పోసి ఇంజనీరో ఇంకేదో ఉద్యోగమో చేస్తున్న వాళ్లు నెలకు ఎంత సంపాదిస్తారు?మహా అంటే రూ.30వేలు అంతకుమించి వెళ్లాలంటే చాలా అనుభవం గడించాలి.అప్పుడు కానీ నెలవేతనం రూ.40వేలు దాటి వెళ్లదు.కానీ కొంతమంది ఏమాత్రం చదువుకోకపోయినా చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ల కళ్ల ముందే చిన్నచిన్న వ్యాపారాలు మొదలుపెట్టి కోటీశ్వరులైన ఉదంతాలు గతంలో ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.చదువుకోని వ్యక్తులు వ్యాపారాలు ప్రారంభించి అందులో ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులకు వేలకువేలు వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారు.ఇటువంటిదే చెన్నై నగరంలో వెలుగు చూసింది.చెన్నై నగరంలోని స్థానిక పత్రికలో వచ్చిన ఒక ప్రకటన చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు.పేపర్‌ ప్రకటనలో ఏముందో పరిశీలిస్తే.. తోపుడుబండిపై కొబ్బరిబొండాల వ్యాపారం చేసే వ్యక్తి తన వద్ద కొబ్బరిబొండాలు కొట్టడానికి ఒక మనిషి కావాలని అందుకు నెలకు రూ.22 వేల నుంచి రూ.32వేల వరకు వేతనం ఇస్తానంటూ ప్రకటించాడు. కొంతమంది పరీక్షించడానికి ప్రకటనలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయగా ప్రకటన నిజమేనని బొండాలు కొట్టడానికి వచ్చే వ్యక్తికి రూ.32వేల వరకు వేతనం ఇస్తానంటూ స్పష్టం చేశాడు కొబ్బరిబొండాల వ్యాపారి.బొండాలు కొట్టే వ్యక్తికే రూ.32వేలు వేతనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటే బొండాల వ్యాపారంలో ఎంత లాభం గడిస్తున్నాడోనని ప్రకటన చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos