అమిత్ షా చేతిలో కేసీఆర్ జుట్టు

అమిత్ షా చేతిలో కేసీఆర్ జుట్టు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం గురించి కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం వేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. 2004 సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడ కనిపించలేదు ఎందుకు? అప్పుడు అమెరికాలో కేటీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రి అయిన తర్వాత కేటీఆర్, కవితఃలు తెలంగాణకు వచ్చారన్నారు. అనవసరంగా కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని కేటీఆర్ అన్న మాటలకు చాలా మంది సాక్షులు ఉన్నారని తెలిపారు. ఏపీలో పార్టీ ఉనికిపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన చరిత్ర తమది అని చెప్పుకొచ్చారు. ఆకాశం మీద నుంచి ఊడిపడినట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ తల్లి మీద ఓట్టేసి మందు, పైసల్ పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా? అని ఎమ్మెల్సీ సవాల్ విసిరారు. రెండో ప్రభుత్వంలో ఒక్క కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించలేదన్నారు. ఎన్నికల కోసమే కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దలితబంధుకు ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ళు లేని గ్రామం లేదన్నారు. అధికార పార్టీలో చేరితేనే దలితబంధు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్ అంటుంన్నారని.. ఇదే నా కేటీఆర్ దృష్టిలో పారదర్శకత అంటే అని ప్రశ్నించారు. కలెక్టర్లు బీఆర్ఎస్ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకోకుండా లబ్ది దారులను ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్లు బోమ్మా, బొడుసు లాంటివని.. బీజేపీ సహాకారంతోనే గతంలో బీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లిందన్నారు. అమిత్ షా చేతిలో కేసీఆర్ జుట్టు ఉందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ చేస్తుందని ఇందులో కేటీఆర్ కూడా భాగస్వామే అంటూ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos