వినయ్ శర్మ క్షమాభిక్ష వినతి తిరస్కరణ

వినయ్ శర్మ క్షమాభిక్ష వినతి తిరస్కరణ

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ చేసిన క్షమాభిక్ష వినతిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు. చట్ట పరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని దోషులు చేసిన విఙ్ఞప్తి మేరకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా శుక్ర వారం ఆదేశాల్ని జారీ చేయటం తెలిసిందే. దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని న్యాయ స్థానం జనవరి 17న ఆదేశించింది. వినయ్ క్షమాభిక్ష వినతిని రాష్ట్రపతి కోవింద్ పరిశీలిస్తుండగా మిగిలిన ఇద్దరు-అక్షయ్, పవన్ చట్ట పరమైన అవకాశాలను ఉపయోగించు కునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలని వారి తరఫున లాయర్ ఏపీ సింగ్ గురు వారం అడిషనల్ సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబం ధ నలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి మరణ శిక్షను వాయిదా వేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos