‘సైరా’ వీరారెడ్డి…

  • In Film
  • February 12, 2019
  • 167 Views
‘సైరా’ వీరారెడ్డి…

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మాతగా,సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సైరా నరసింహారెడ్డి కేవలం తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా జాతీయ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది.బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌,తెలుగు నటుడు జగపతి బాబు,కన్నడ అగ్రహీరో సుదీప్‌,తమిళంలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన విజయ్‌ సేతుపతి,లేడీ సూపర్‌స్టార్‌ నయనతార తదితర భారీ తారాగణంతో తెరెక్కుతున్న సైరా ఆగస్ట్‌౧౫న విడుదలకు ముస్తాబవుతోంది.ఇప్పటికే చిత్రంలో నటిస్తున్న ముఖ్య తారాగణం ఫస్ట్‌లుక్‌లను ఆయా నటులు పుట్టినరోజు తేదీల్లో విడుదల చేసిన సైరా చిత్ర బృందం తాజాగా జగపతి బాబు ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది.మంగళవారం జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో వీరారెడ్డి పాత్ర పోషిస్తున్న జగపతి బాబు ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభిస్తోంది. “వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సైరా నుండి #వీరారెడ్డి డైనమిక్ లుక్ ను విడుదల చేస్తున్నాం. #HBDJagapathiBabu” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. .. పొడవాటి జుట్టు.. పైన పట్టు తలపాగా.. మెలిదిరిగిన మీసాలు.. పొడవాటి గడ్డం.. ఖరీదైన దుస్తుల్లో యాజ్ యూజువల్ గా జగపతిబాబు హ్యాండ్సమ్ గా ఉన్నారు.  వీరారెడ్డిగా జగపతి ఆహార్యం ఎంతో గంభీరంగా ఉంది. ‘సైరా’ టీమ్ మాత్రమే కాదు. జగ్గూభాయ్ కి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది మెగా ఫ్యాన్స్ ‘హ్యాపీ బర్త్ డే ప్రెసిడెంట్ గారు’ అంటూ ‘రంగస్థలం’ టచ్ ఇస్తుండడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos