జగన్‌ది తిరోగమన నిర్ణయం..

జగన్‌ది తిరోగమన నిర్ణయం..

డిమాండ్లు నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు పది రోజులుగా చేస్తున్న సమ్మె తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జయప్రకాశ్ నారాయణ తప్పుపట్టారు. తాత్కాలికంగా ఓట్ల ప్రయోజనాల కోసం ఇటువంటి నిర్ణయాలు సంస్థ తిరోగమనానికి కారణమవుతాయని చెప్పుకొచ్చారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు చెల్లించాలని.. వ్యాపార సంస్థగా ఆర్టీసీలో పోటీ తత్వం పెంచాలని సూచించారు. డీజిల్ ధరలు పెరిగినా..ప్రజల్లో రాజకీయ సానుకూలత కోసం టిక్కెట్ ధరలు పెంచకుండా సంస్థకు నష్టం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘ కాలికంగా మంచిది కాదని జేపీ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయని హెచ్చరించారు. అదే సమయంలో ఆర్టీసీపై కేసీఆర్ ఆలోచనలతో జేపీ ఏకీభవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos