అమర జవాన్లకు నివాళిగా…

  • In Sports
  • March 8, 2019
  • 195 Views
అమర జవాన్లకు నివాళిగా…

రాంచీ : భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ టోపీలను ధరించారు. పుల్వమా సంఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా వీటిని వేసుకున్నారు. లెఫ్ట్నెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో మహేంద్ర సింగ్ ధోనీ ఈ టోపీలను ఆటగాళ్లకు ఇచ్చాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ అమర జవాన్లకు నివాళులర్పించడానికి ఈ టోపీలను ధరించామని, ఈరోజు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తామని వెల్లడించారు. జవాన్ల కోసం, వారి కుటుంబాల కోసం దేశంలో అందరూ ఎంతో కొంత సాయం చేయాలని కోహ్లీ కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos