కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయట!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయట!

ఐదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల విభజన చట్టాన్ని స్వహస్తాలతో లిఖించిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.భవిష్యత్తుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి ఏకం కానున్నాయంటూ జైరాం రమేశ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.అయితే తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అది సాధ్యం కాదని తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయంటూ సెలవిచ్చారు.తన వాదనను సమర్థించుకోవడానికి లాజిక్‌లేని లాజిక్‌ను కూడా ప్రస్తావించారు. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత జర్మనీ.. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటిగా ఏర్పడ్డాయని.. అదే రీతిలో ఉత్తర.. దక్షిణ కొరియాలు కూడా ఒక్కటిగా మారుతుంటాయని చెబుతుంటారని.. అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోయేందుకు ఉద్యమం రావటం ఖాయమని చెప్పుకొచ్చారు. విడిపోయిన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయని ఈ నేపథ్యంలో భవిష్యత్తుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయంటూ వ్యాఖ్యానించారు.జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అచేతన స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త ఊపిర్లు ఊదే ప్రయత్నంగానే కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.ఒకవేళ జైరాం అన్నట్లు కేసీఆర్‌ దిగిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమయ్యాయే అనుకుందాం.మళ్లీ రాజధాని,ఇప్పటి వరకు నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణదశలోనున్న ప్రాజెక్టులు ఇలా ఎన్నో అంశాలను ఎలా పరిష్కరిస్తారు?మరుసటి ఎన్నికల్లో తిరిగి కేసీఆర్‌ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి?.మరోసారి విభజనకు ఆంధ్రులు సిద్ధపడాలా?కాంగ్రెస్‌ పార్టీ లబ్ది కోసం రాష్ట్రాలను కలపడం,విడదీయడం చేస్తూ వెళతారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos