అమిత్ షా కుమారుడికి అంత డబ్బు ఎలా వచ్చింది?

అమిత్ షా కుమారుడికి అంత డబ్బు ఎలా వచ్చింది?

కోల్కతా: తాను మేనల్లుడు కోసం పరితపిస్తున్నానని వారు(అమిత్షా) అంటున్నారని, మరీ మీ కుమారుడు సంగేతంటనీ? ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎదురు ప్రశ్నించారు. ‘మేము బెంగాల్లో ఉన్నందున తాము చెడ్డవాళ్లమయ్యాం. మీ కుమారుడు అంత డబ్బు ఎలా సంపాదించాడో సమాధానం చెప్పండి. మేము వాస్తవాలు మాట్లాడతాం. మాతో మాటల యుద్ధానికి దిగితే…మీ పరువే పోతుంద’ని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార తృణమూల్, విపక్ష బిజెపి నేతలు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయ విమర్శలు కాస్తా..కుటుంబ సభ్యులను తాకే స్థాయికి చేరాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా…బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆమె మేనల్లుడు, తృణమూల్ ఎంపి అభిషేక్ బెనర్జీని రాజకీయ వారసుణ్ణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారిని ఆరోపించారు. అమిత్షా కుమారుడిపై మమత విమర్శలు గుప్పించారు. మేనల్లుడు వర్సెస్ బేటా కుమారుడు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos