జై షా రెండు చేతులా సంపాదిస్తున్నాడు

జై షా రెండు చేతులా సంపాదిస్తున్నాడు

కోల్కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమపై చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధైర్యముంటే మొదట తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాతే తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పైలాన్ లో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. అమిత్ షాపై విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అభిషేక్కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ చేస్తోన్న విమర్శలకు దీటుగా బదులిచ్చారు. ‘పార్టీలో అందరిలాగే అభిషేక్ కూడా ఒకరు. అతడికి ప్రత్యేక మినహాయింపులు ఉండవ’ని వ్యాఖ్యానించారు. ‘నాపై 1990 ఆగస్టు 16న సీపీఎం కార్యకర్తలు కోల్కతాలో దాడికి పాల్పడే సమ యానికి అభిషేక్ చాలా చిన్న పిల్లాడు. నాపై ఎందుకు దాడి జరిగింది? అని అడుగుతూ జెండా పట్టుకుని చుట్టూ తిరుగుతూ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిల దీశాడ’ని గతాన్ని గుర్తు చేసారు. ‘ఒకసారి అతనిపై దాడికి ప్రయత్నించలేదా? అతను ఇప్పటికీ ఒక కంటిని సరిగ్గా చూడలేడు.. ఇది దాదాపు అందరికీ తెలుసు.. అభి షేక్ను నేరుగా రాజ్యసభ ద్వారా పార్లమెంట్కు పంపొచ్చు. కానీ, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని ప్రజా తీర్పుతోనే లోక్సభలో అడుగుపెడతానన్నాడు. అందుకే ముందుగా అభిషేక్ బెనర్జీపై గెలిచి, తనపైన విమర్శలు చేయాలి’ అని మమతా సవాల్ విసిరారు. అమిత్ షా కుమారుడు జై షా క్రికెట్ అసోసియేషన్లో ఎలా స్థానం సంపాదించారని నిలదీశారు. వందల కోట్ల రూపాయలను ఎలా సంపాదిస్తున్నారని ప్రశ్నించారు. దుమ్ముంటే అమిత్ షా తన కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి అని మరో సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తృణమూల్ విజయం సాధిస్తుందని, గత ఎన్నికల రికార్డులను తిరగరాస్తామని ఉద్ఘాటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos