జగన్‌కు గవర్నర్ ఆహ్వానం

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆహ్వానించారు. వైకాపా శాసన సభా పక్షం నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ భవన్‌ చేరుకున్న జగన్‌, గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినందున, జగన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతకు ముందు వైకాపా సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు రాజ్‌ భవన్‌కు చేరుకుని జగన్‌ను పార్టీ శాసన సభా పక్ష నాయకుడుగా ఎన్నుకుంటూ చేసిన తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos