3 రాజధానుల ముసాయిదా వెనక్కు

3 రాజధానుల ముసాయిదా వెనక్కు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ చట్టం విషయంలో వెనక్కి తగ్గింది. ఈ అంశాన్ని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకి నివేదించారు. హైకోర్టులో ఈ చట్టాల మీద విచారణ సాగుతోంది. అనేక మంది అభ్యంతరాలు వేస్తూ పిటీషన్లు వేయడంతో నవంబర్ 15 నుంచి రోజువారీ విచారణ ప్రారంభమయ్యింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఆసక్తిగా మారింది. ఈ చట్టాన్ని కొన్ని సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తొలుత పాత చట్టాన్ని రద్దు చేస్తూ ఓ బిల్లు ప్రవేశపెట్టాలసి ఉంది. ప్రస్తుతం మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తోంది. ఆ ముసాయిదాను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు చెబుతున్నారు. డిసెంబర్ 19 , 2019లో మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. 2020 జనవరి లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేశారు.ఆ తర్వాత అదే సంవత్సరం ఆగష్టులో చట్టంగా మారింది. దీనిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. కోర్టులో విచారణ సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos