జ‌మ్మూ‌-కశ్మీ‌ర్ ప్ర‌జ‌ల హ‌క్కు‌ల‌ కోసం వామ‌ ప‌క్షాల నిర‌స‌న‌

జ‌మ్మూ‌-కశ్మీ‌ర్ ప్ర‌జ‌ల హ‌క్కు‌ల‌ కోసం  వామ‌ ప‌క్షాల నిర‌స‌న‌

విజయవాడః జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం ప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా వామ పక్షాలు బుధవారం ఇక్కడి లెనిన్ సెంటర్లో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. మధు విలేఖరులతో మాట్లాడారు. ‘భారతదేశంలో జమ్ము-కశ్మీర్ అంతర్భాంగం అయినపుడు అక్కడి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వాటిని రద్దు చేసి అక్కడి ప్రజల స్వేచ్ఛను, మనో భావాలను దెబ్బ తీసింది. దేశంలోని మైనారిటీల, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను రద్దు చేసి, భారత ప్రజల హక్కులను కాలరాచే విధంగా భాజపా ప్రభుత్వం తీరు ఉంద’ని విమర్శించారు. ఈ విషయంలో వైకాపా, తెదేపా, తెరాస పార్టీలు పచ్చి అవకాశవాదులుగా మరో మారు రుజువయ్యారని చెప్పారు. ఇతర వామపక్షాలు, భావ సారూప్యత కలిగిన ఇతర పార్టీలతో కలసి ఆందోళన చేస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos