యాపిల్ నుంచి జానీ ఐవ్ నిష్క్రమణ

యాపిల్  నుంచి జానీ ఐవ్ నిష్క్రమణ

వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ చీఫ్ డిజైనర్, స్టీవ్ జాబ్స్ నమ్మిన బంటు జానీ ఐవ్ రాజీనామా చేయనున్నట్లు శుక్ర వారం ప్రకటించారు. వచ్చే డిసెంబరులో యాపిల్ నుంచి వైదొలగి సొంత డిజైనింగ్ సంస్థ- లవ్ ఫ్రమ్ను ప్రారంభించ నున్నట్లు తెలిపారు. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. కంపెనీని అగ్రస్థానంలో నిలపడంలో జానీ శ్రమ ఎంతో ఉంది. 28 ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న ఆయన యాపిల్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈయన డిజైన్లే కంపెనీకి కొత్త రూపు, ఊపునిచ్చాయి. 1992లో యాపిల్ సంస్థలో చేరిన జానీ 1996లో డిజైనింగ్ జట్టులో స్థానాన్ని సంపాదించారు. అప్పటి నుంచి యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్కి ప్రధాన అనుచరుడిగా సలహాలిస్తుండేవారు. 2015లో ఆయన చీఫ్ డిజైన్ ఆఫీసర్గా నియమితులయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos