వర్క్ ఫ్రం హోమ్‌కు దిద్దుబాట్లు

  • In Money
  • December 15, 2021
  • 71 Views
వర్క్ ఫ్రం హోమ్‌కు దిద్దుబాట్లు

కోవిడ్-19తో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఐటీ ఉద్యోగుల విషయంలో కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది. పలు ఐటీ దిగ్గజ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో కనీసం 50 శాతం ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా హ్రైబ్రిడ్ మోడల్‌ను కూడా ప్రవేశ పెట్టాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి.
జూలై నాటికి వంద శాతం…
వచ్చే ఏడాది నుంచి 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు ఆఫీసులకు వారానికి రెండు లేదా మూడు రోజులు రావాలని ఐటీ కంపెనీలు ఉద్యోగులను అడుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూలై నాటికి 100 శాతం మేర ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలను ఐటీ కంపెనీలు ముమ్మరం చేస్తున్నాయి.
ఒమిక్రాన్‌పై ఆచితూచి…
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచదేశాలు భయపడిపోతున్నాయి. ఈ సమయంలో ఒమిక్రాన్ ఎఫెక్ట్‌పై ఐటీ కంపెనీలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్- 19 సెకండ్ వేవ్‌తో ఆఫీసులకు ఉద్యోగులను పిలవాలనే ఆలోచనను ఐటీ కంపెనీలు ఉపసంహరించుకోగా… తాజాగా వస్తోన్న కొత్త వేరియంట్‌పై కంపెనీలు అచితూచి వ్యవహరించాలని భావిస్తున్నాయి.
ఆఫీసుల్లో కొత్త హంగులు
టెక్ కంపెనీలకు ఆఫీసు స్థలాన్ని అందించే ప్రముఖ డెవలపర్లు, ప్రపంచ సంస్థలు , వారి క్లయింట్లు కార్యాలయాలను తెరిచేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్-సముచితమైన పద్ధతులను అనుమతించడంతోపాటుగా, ఆఫీసుల్లో పలు కీలక మార్పులను, కొత్త నిబంధనలకు తెచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కోవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలను తీసుకోవడానికి ఆయా కార్యాలయాల నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగుల మధ్య ఎక్కువ అంతరం ఉండేలా చూడనున్నాయి.
ఒమిక్రాన్ ఎఫెక్ట్ అంతగా లేదు..!
ప్రాపర్టీ అమ్మకాల్లో ఒమిక్రాన్ ఎఫెక్ట్ అంతగా లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) పేర్కొంది. గత కొద్దిరోజుల నుంచి అమ్మకాలలో వృద్ధి ఊపందుకోవడం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే నెలల్లో కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతుంటే తప్ప, నిర్మాణ , డెలివరీ షెడ్యూళ్ల  వేగానికి ఎటువంటి అంతరాయం కలగదని ఓ పత్రిక నివేదించింది. భవిష్యత్తులో ప్రభుత్వాలు పూర్తిగా లాక్ డౌన్, కర్ప్యూలను పెడితే ఆర్థిక పునరుద్దరణ దెబ్బ తినే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos