శశికళకు ఐటీ షాక్

శశికళకు ఐటీ షాక్

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయ పన్ను అధికారులు ఆమెకు చెందిన రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపచేశారు. వీటిలో రూ.300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. సిరుతవుర్, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు శశికళ, ఇలవరసి, సుధాకరన్ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. స్తంభింపచేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు. కాగా, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos