బీజేపీలోకి భూమా వారసులు?

బీజేపీలోకి భూమా వారసులు?

గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిన తెదేపా అధినేత చంద్రబాబుకు కొద్ది కాలంగా అదే ఫిరాయింపులు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో చరిత్రలో కనివినీ ఎరుగని ఘోరంగా తెదేపా ఓటమి చవిచూడడంతో తెదేపా నేతలు ఒక్కొక్కరూ ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా ఇంకా చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.కొన్ని జిల్లాల్లో అధికార వైసీపీలో చేరడరానికి తెదేపా ఎమ్మెల్యేలు సైతం ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అందుకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పార్టీ ద్వారాలు తెరవకపోవడంతో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన భూమా నాగిరెడ్డి వారసులు భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిలు బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ,లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసిన జిల్లాల్లో కర్నూలు జిల్లా కూడా ఒకటి.ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక జిల్లాలో తెదేపాకు భవిష్యత్తు లేదని భావించి అఖిలప్రియ,బ్రహ్మానందరెడ్డిలు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో గతంలో తెదేపాలోకి ఫిరాయించకముందు ఉన్న వైసీపీలోకి వెళదామంటూ జగన్‌ అందుకు అంగీకరించరు.దీంతో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఒకేసారి బీజేపీలోకి వెళ్లకుండా మొదల సోదరుడు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేర్పించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అఖిలప్రియ‌, రువాత బ్రహ్మానంద రెడ్డి ఇద్దరూ కాషాయ కండువాను ప్పుకోవచ్చని మాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos