లోకేశ్‌ అలా బాలయ్య ఇలా..

లోకేశ్‌ అలా బాలయ్య ఇలా..

 ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌లో 23 స్థానాలకే పరిమితవడం తెలిసిందే.కొస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ కాగా కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు సీట్లు గెలుచుకుంది.ఇక వైసీపీ బాగా పట్టున్న రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో తెదేపాకు కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది.రాయలసీమలో మొత్తం 52 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వైసీపీ 49 స్థానాలు దక్కగా తెదేపా కేవలం మూడంటే మూడు నియోజకవర్గాల్లో గెలుపొందింది.తెదేపా అధినేత చంద్రబాబు,నందమూరి బాలకృష్ణ,పయ్యావుల కేశవ్‌ మాత్రమే విజయం సాధించారు.ఈ ఫలితాలతో ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా పూర్తిగా డీలా పడిపోయింది.తెదేపా అధినేత కూడా నైరాశ్యంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో తెదేపా భవిష్యత్తుపై తెదేపా శ్రేణుల్లో కలవరం మొదలైంది. చంద్రబాబు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నారా లోకేశ్‌ అంత చురుగ్గా లేకపోవడం రాజకీయాలపై,సమస్యలు వాటికి పరిష్కార మార్గాలపై అవగాహన లేకపోవడం,ప్రసంగాల్లో తడబాటు అన్నింటికంటే ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఏకోశాన లేకపోవడంతో తెదేపా శ్రేణులు పార్టీని నడిపించే నాయకుడి కోసం వెతకసాగారు.ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ మాత్రమే పార్టీని నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడిగా భావిస్తున్నారు.అయితే బాలకృష్ణ మాత్రం రాజకీయాల గురించి తెదేపా గురించి తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడం తెదేపా శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాయలసీమలో తెదేపా పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నా బాలకృష్ణ మాత్రం సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుండడం తెదేపా నేతలు,కార్యకర్తలు లోలోపలో అసహనంతో రగిలిపోతున్నారు.కనీసం రాయలసీమ వరకైనా బాలకృష్ణకు తెదేపా బాధ్యతలు అప్పగించి డీలాపడ్డ తెదేపా శ్రేణల్లో ఉత్సాహం నింపి వచ్చే ఎన్నికల నాటికి తెదేపాను బూత్‌స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నా బాలయ్య మాత్రం వరుసగా సినిమాల అంగీకరిస్తూ తెరపై హీరోగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారు.వయసు మీద పడడంతో నాయకత్వ బాధ్యతలు చంద్రబాబుకు భారంగా మారడంతో నాయకత్వ బాధ్యతను తనయుడు లోకేశ్‌కు అప్పగించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.అయితే లోకేశ్‌ మాత్రం రాజకీయ పరిజ్ఞానల లేనివాడిలా ప్రవర్తిస్తుండగా బాలయ్య మాత్రం తనలోకం తనదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైసీపీ దూకుడు తట్టుకొని తెదేపాను గట్టెక్కించి వచ్చే ఎన్నికల నాటికి తెదేపాను ముందుకు నడిపించే నాయకుడి కోసం తెదేపా శ్రేణులతో పాటు చంద్రబాబు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos