కోర్టులపై జగన్ ఫిర్యాదు..మాట దాటవేసిన మోడీ..

కోర్టులపై జగన్ ఫిర్యాదు..మాట దాటవేసిన మోడీ..

రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సమావేశమైన విషయం తెలిసిందే.దీనిపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు లేవనెత్తుతుండగా సమావేశంలో చర్చించుకున్న కొన్ని అంశాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి నిధుల ఇవ్వమని అడగంతోపాటు కోర్టులపై ఫిర్యాదు అంశం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కోర్టు తనను పని చేసుకోనివ్వడంలేదంటూ సీఎం జగన్‌ న్యాయ వ్యవస్థపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరిన్ని సమస్యలు వివరిస్తుండగా… కొద్దిసేపు ప్రధాని నరేంద్ర మోడీ చిరునవ్వుతో ఆలకించారు.ఆ తర్వాత, సీఎం మాటలను అడ్డుకుని, ‘ఇవన్నీ అమిత్‌ షాకు ఇప్పటికే చెప్పారు కదా! ఇంకేంటి విశేషాలు’ అని అడిగినట్లు తెలిసింది. దీంతో, 17 అంశాలతో గతంలోనే సమర్పించిన ఒక వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో ఆయనతో జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలపై ఈ భేటీలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos