విక్రమ్ చిత్రంతో ఇర్ఫాన్‌ రెండో ఇన్నింగ్స్‌..

విక్రమ్ చిత్రంతో ఇర్ఫాన్‌ రెండో ఇన్నింగ్స్‌..

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలోనే వెండితెరపై మెరవడానికి సిద్ధమయ్యాడు.తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఇర్ఫాన్ ఓ కీలకపాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా ఇర్ఫాన్ వెల్లడించాడు.భారీ వ్యయంతో విక్రమ్ 58వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ కనిపించనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇర్ఫాన్ పఠాన్ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ సెవెన్ స్ర్కీన్ స్టూడియో ట్వీట్ చేసింది.ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం.ఒకవేళ విక్రమ్ 25 గెటప్స్లో కనిపిస్తే.. ఒకే సినిమాలో అత్యధిక పాత్రలను పోషించిన నటుడిగా విక్రమ్ ప్రపంచ రికార్డును నెలకొల్పుతాడు. ఇప్పటికే మరో బౌలర్ శ్రీశాంత్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos