ధోనీ లేకుంటే చెన్నై కుచ్ నై..

  • In Sports
  • April 27, 2019
  • 134 Views
ధోనీ లేకుంటే చెన్నై కుచ్ నై..

ఐపీఎల్‌ లీగ్‌ మొదటి సీజన్‌ నుంచి ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌ వరకు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నేతృత్వం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తూ అశేష అభిమానగణాన్ని సంపాందించుకుంది.ప్రతీ సీజన్‌లోనూ చెన్నై జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మూడు సార్లు టైటిల్‌గా గెలవగా ఐదు సార్లు ఫైనల్‌కు చేరుకున్న ఘనత కేవలం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మాత్రమే సొంతం.అయితే చెన్నై జట్టు విజయం వెనుక ధోనీ పాత్ర ఎంతో కీలకమని ధోనీ లేకుంటే చెన్నై జట్టు సాధారణ జట్టు కంటే పేలవజట్టు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్‌లో ధోనీ లేకుండా బరిలో దిగిన చెన్నై జట్టు రెండుసార్లు చిత్తుచిత్తుగా ఓడిపోయింది.ధోని టీమ్‌లో ఉంటే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చే చెన్నై… ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. ధోని లేకుండా ఈ సీజన్‌లో రెండు సార్లు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్…. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఏప్రిల్ 17న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కి గాయం కారణంగా ధోనీ దూరమవ్వగా.. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన చెన్నై.. తాజాగా ముంబై ఇండియన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఇప్పడు ఇదే అంశంపై చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. ఫన్నీ మీమ్స్‌, కామెంట్స్‌తో ఆటగాళ్లను ఆడుకుంటున్నారు. ధోని లేకుంటే చెన్నై జట్టు ఉత్తదేనని, అతను లేకుండా ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదని కామెంట్‌ చేస్తున్నారు. ధోని రిటైర్మెంట్‌ తీసుకుంటే చెన్నైజట్టు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos