ఆధిక్యంలో కాంగ్రెస్-జేఎంఎం కూటమి

ఆధిక్యంలో కాంగ్రెస్-జేఎంఎం కూటమి

రాంచి: ఝార్ఖండ్ శాసన సభకు ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం మధ్యాహ్నం కూడా కొనసాగింది. రెండున్నర గంటల ప్రాం తం లో భాజనా 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఝార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం), ఆర్జేడీల కూటమి 43 స్థానా ల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ముక్తి మోర్చ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ముందుకు దూసుకు పోతున్నారు. మహాకూటమి ఘనవిజయం సాధించబోతోంది. మేమంతా హేమంత్ సోరెన్ నాయకత్వంలో ఎన్నికల్లో బరిలో నిలిచాం. ఆయనే కాబోయే ముఖ్యమంత్రి’ అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యా నిం చారు. ‘ఫలితాలు మా అంచనాలకు తగ్గట్లుగా లేవు. ప్రజల నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. మాకు ఏ పాత్ర పోషించే అవకా శాన్ని ఇస్తే దాన్ని పోషిస్తాం. ఏం చేయాలి, ఎలా చేయాలనేది పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత మేం చర్చించుకుంటాం” అని జేవీఎం(పీ) అభ్యర్థి బాబూలాల్ మరాండీ అన్నారు. 81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ శాసనసభకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకూ ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం 65.17. భాజపా 79 స్థానాల్లో పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 37 స్థానాలు వచ్చాయి. అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ) మద్ద తుతో భాజపా ప్రభుత్వం ఏర్పాటయ్యింది. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. ఈసారి ఏజేఎస్యూ బీజేపీతో తెగదెంపులు చేసు కుని, విడిగా పోటీ చేసింది. ఎన్నికల తర్వాత తిరిగి భాజపాతో కలిసే అవకాశాలూ లేకపోలేదని ఏజేఎస్యూ అధ్యక్షుడు వ్యాఖ్యా నించారు. ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ భాగం రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అంచనా వేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos