ఫ్యాక్షన్‌ లీడర్‌గా విజయశాంతి..

  • In Film
  • June 6, 2019
  • 156 Views
ఫ్యాక్షన్‌ లీడర్‌గా విజయశాంతి..

సూపర్‌ష్టార్‌ మహేశ్‌బాబు తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం చిత్రీకరణ కూడా మొదలుకాక ముందే చిత్రంపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.మహేశ్‌ క్రేజ్‌కు తోడు అలనాటి లేడీసూపర్‌స్టార్‌ విజయశాంతి ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేయనుండడంతో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి.తాజాగా చిత్రంలో విజయశాంతి పోషించనున్న పాత్ర గురించి వినిపిస్తున్న వార్తలు చిత్రంపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రంలో విజయశాంతి బలమైన ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి విజయశాంతి పాత్రని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారట. తప్పనిసరి పరిస్థితుల్లో విజయశాంతి తన సొంత ఊరి కోసం ఫ్యాక్షనిస్టుగా మారుతుందట. ఆమె ప్రత్యర్థిగా జగపతి బాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది.విజయశాంతి ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయశాంతి పాత్ర మహేష్ బాబుకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు హీరోగా విజయశాంతికి మించి పవర్ ఫుల్ గా నటించాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబు తక్కువేం కాదు కదా. మంచి సన్నివేశాలు పడితే మహేష్, విజయశాంతిని ఒకే ఫ్రేములో చూడడం ఫ్యాన్స్ కు పండగే.ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos