మెడిక్లెయిం పాలసీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

మెడిక్లెయిం పాలసీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

న్యూ ఢిల్లీ: బీమా పాలసీ జారీ చేసిన తర్వాత పాలసీదారుకు తొలి నుంచి నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు బీమా సంస్థలు పరిహారాన్ని చెల్లించితీరాల్సిందేనని న్యాయ మూర్తులు డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘పాలసీ తీసుకునేవారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు తెలిసిన అన్ని సమస్యల గురించి బీమా సంస్థకు తెలపాలి. పాలసీ దారు తనకు తెలిసిన వాటినే వెల్లడించగలడు. ఒక్కసారి పాలసీ జారీ చేస్తే బీమా సంస్థ ముందు నుంచి ఉన్న సమస్య అంటూ క్లెయిమ్ ను తిరస్కరించరాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. మన్మోహన్ నందా అనే వ్యక్తి ఓవర్సీస్ మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం చేరుకున్న తర్వాత గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. గుండె రక్తనాళాలు పూడుకుపోయినట్టు గుర్తించి స్టెంట్లు వేశారు. నందా పరిహారానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతడికి హైపర్ లిపిడేమియా, మధుమేహం సమస్యలు ఉన్నాయని, స్టాటిన్ మాత్రలు వాడుతున్నా పాలసీ కొనేటపుడు వెల్లడించలేదని బీమా సంస్థ క్లెయిమ్ ను తిరస్కరించింది. వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక లో పాలసీదారుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. ఉన్నట్టుండి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరాల్సి వస్తే రక్షణ కోసమే పాలసీ తీసుకుంటారన్న సూక్ష్మ అంశాన్ని కోర్టు గుర్తు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos