మృతుల కుటుంబాలకు త్వరగా చెల్లింపులు

మృతుల కుటుంబాలకు త్వరగా చెల్లింపులు

న్యూ ఢిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు త్వరగా చెల్లింపుల్ని ముగించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం ఆదేశించింది. స్పష్టం చేసింది. కొవిడ్-19 డెత్ క్లైమ్స్కు ‘ఫోర్స్ మెజర్’ (Force Majerue) నిబంధన వర్తించదని తెలిపింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు ‘ఫోర్స్ మెజర్’ను అమలు చేస్తారు. స్పష్టత కోసం ఎంతోమంది వినియోగదారులు బీమా సంస్థల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. తమ ఖాతాదార్లకు ఈ విషయాల్ని వ్యక్తి గతంగా వెల్లడించాలని బీమా సంస్థల్ని ఆదేశించింది. ఈ సంక్లిష్ట సమయంలో కొవిడ్-19 డెత్ క్లైమ్స్ సహా ఎన్నో సేవలను డిజిటల్ రూపంలో అందజేస్తున్నాం. ఈ కష్టకాలంలో బీమా సంస్థలన్నీ ఖాతాగదారులకు అండగా నిలవాలి. తప్పుడు సమాచారానికి తావులేకుండా చూడాలి’ అని మండలి ప్రధాన కార్యదర్శి జనరల్ ఎస్ఎన్ భట్టాచార్య తెలిపారు. ఏప్రిల్ నెల బీమా పాలసీల ప్రీమియం చెల్లించే వినియోగదారులకు మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తున్నామని ఐఆర్డీఏఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే

తాజా సమాచారం

Latest Posts

Featured Videos